దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి హఠాన్మరణం

0
10
దివంగత నందమూరి తారక రామారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. ఆయన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే ఉమా మహేశ్వరి తన చిన్న కుమార్తెకు వివాహం జరిపించగా.. అంతలోనే ఆమె గుండెపోటుతో చనిపోవడం బాధాకరం.

ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉమా మహేశ్వరి కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాసేపట్లో చేరుకోనున్నారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి తొలుత నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో వివాహం కాగా.. అతడు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో వివాహం జరిపించారు.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా.. లోకేశ్వరి, దగ్గుబాాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.

కాగా, ఇటీవలే ఉమా మహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. రాజకీయ విభేదాలతో 25 ఏళ్లు దూరంగా ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతేడాది హైదరాబాద్‌లోని జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకలోనే కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉమా మహేశ్వరి మృతిపై పలువురు సంతాపం తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here