మొవ్వ మండలం జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామం బట్ల పెనమర్రులో నిర్వహిస్తున్న భారత్ అజాధికా అమృత్ మహోత్సవాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,బిజెపి నేతలు. పింగళి వెంకయ్య మనవరాలు సుశీలను సత్కరించిన కిషన్ రెడ్డి. బట్ల పెనమర్రు గ్రామానికి రోడ్డు, పింగళి వెంకయ్య స్మరాకాన్ని ఏర్పాటు చెయ్యాలన్న గ్రామస్తుల వినతులకు స్పందించిన కిషన్ రెడ్డి సభా మధ్యలోనే జాయింట్ కలెక్టర్ వెళ్లి పోవడంతో అసహనం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి. గ్రామంలో రోడ్డు నిర్మించేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో పింగళి వెంకయ్య గ్రామానికి వచ్చాం. పింగళి,అల్లూరి, టంగుటూరి లాంటి అనేక మంది మహానుబావుల పోరాట ఫలితమే మనకు స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర పండుగలో పింగళి వెంకయ్యను మర్చిపోతే చరిత్ర క్షమించదు. మనకు ఊపిరి లాంటి జెండాను అందించిన పింగళి వెంకయ్య గొప్పవాడు. ఢిల్లీ నుండి గల్లి వరకు ఆగస్ట్ 15న దేశంలో 18కోట్ల జాతీయ జెండాలు ఎగరవేస్తాం. 6వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ మాట్లాడుతారు. దేశ రాజధాని ఢిల్లీలో పింగళి వెంకయ్య 146 జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ఆగస్ట్2 పింగళి జయంతి వేడుకల్లో ఆయన స్మారక పోస్టల్ స్టాంప్ ను అమిత్ షా దేశ ప్రజల అంకితం చేస్తారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ కలుస్తారు. అమర గాయకుడు, స్వతంత్ర సమరయోధుడు ఘంటశాల శత జయంతి వేడుకలను కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆగస్టు 13, 14 ,15వ తేదీల్లో దేశమంతా మూడు రంగుల జెండాలతో కలకలలాడలి.