ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు..

0
7

సినిమాలు తీసి చాలా పోగొట్టుకున్నాను, అప్పుడు ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు – జయసుధ

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనినటి జయసుధ తెలిపారు. ఆయనతో కలిసి 16 సినిమాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. 

గుంటూరు జిల్లా తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటి జయసుధ హాజరు అయ్యారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ కుటుుంబ సభ్యుడు నందమూరి మోహన కృష్ణ చేతుల మీదుగా సహజ నటి జయసుధకు అవార్డును అందజేశారు. ఈ క్రమంలోనే జయసుధ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెనాలిలో జరుగుతున్న తన అభిమాన హీరో ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. 

ఆనయతో కలిసి 16 సినిమాల్లో నటించాను..

ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు నటించినందుకు చాలా గర్వపడుతున్నని వివరించింది.  సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి 16 సినిమాల్లో నటించానని పేర్కొంది. నిజంగా ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని జయసుధ చెప్పారు.  తనకు ఎన్టీఆర్ తో ఎన్నో మంచి అనుభూతులు ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఎదుటి వాళ్ళని గౌరవిస్తుండే వారని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని చూసే వారని వివరించారు. డైలాగులపై పట్టు రావాలని, సన్నివేషాలు పండాలని సినిమా స్క్రిప్టు తీస్కొని మొత్తం తన స్వహస్తాలతో తిరగరాసే కథానాయకుడు ఎన్టీఆర్ అంటూ జయసుధ చెప్పుకొచ్చింది. 

సమయపాలన పాటించే క్యారెక్టర్ ఉన్న హీరో..

ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి వ్యావాయం పూర్తి చేసి 6 గంటలకే తన పనులన్నీ పూర్తి చేసుకొని మేకప్ వేస్కొని 7 గంటలకల్లా చిత్రీకరణ సిద్ధంగా ఉండే వారని వివరించింది. సహ నటులు ఎవరైనా మద్యానికి బానిసలై జీవితాన్ని పాడు చేస్కుంటుంటే మందలించి దారిలో పెట్టిన మహోన్నత స్నేహతత్వం ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురించారు. తను 50 ఏళ్ళు సినీ ఇండస్ట్రీనీ పూర్తి చేసుకున్నందుకు ఎన్టీఆర్ ఉండి ఉంటే చాలా ఆనందపడేవారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ వల్ల నట జీవితంలో క్రమ శిక్షణ  నేర్చుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఒక యూనివర్సిటీ అని.. ఎప్పుడు ఆయన్ని చూసి ఎదో ఒకటి నేర్చుకునే వాళ్ళం అని జయసుధ పేర్కొన్నారు. 

ఆయన వల్లే మానసికంగా దృఢంగా అయ్యాను..

తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆమె చెప్పారు. అలాగే సినిమాలు తీసి చాలా పోగొట్టుకున్నానని.. అలాంటి సమయాల్లో కూడా ఎన్టీఆర్ ఎంతో భరోసా ఇచ్చేవారని చెప్పారు. ఆయన వల్ల తను మానసికంగా చాలా దృఢంగా మారినట్లు వివరించారు. 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నానా అని అనిపిస్తున్నట్లు తెలిపింది. తనకు ఇంత మంది అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభిమానం ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఇంత గొప్పగా చేస్తున్న ఆలపాటి.రాజేంద్రప్రసాద్ జయసుధ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here