ఎన్టీఆర్ 30 సినిమా ఆలస్యానికి ఎవరు కారణం

0
6

ఎన్టీఆర్ 30 సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోపే.. సినిమా రిలీజ్ డైట్ పై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ 30 ఆలస్యానికి రీజన్ ఇవే అంటూ. ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

RRR సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షణ్‌లో ఎన్టీఆర్ 30 వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో(Koratala Siva) ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై  ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని  నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 సెట్స్ పైకి వెళ్లడం రోజురోజుు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆలస్యం విషయంలో తారక్ అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ఎన్టీఆర్ 30 షూటింగ్ ఎప్పుడు.. అప్ డేట్ ఎప్పుడు అంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.

అయితే ఈ ఆలస్యానికి కారణాలు అనేకం ఉన్నాయని ఇటీవల రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమాని ప్రారంభించాలనుకున్నా కానీ ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్ గా కొత్త ఇమేజ్ ని అందుకున్నారు. దీంతో దానికి తగిన కథను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కొరాటలపై ఉంది.

కథ ఆలస్యం కావడం వల్లనే కొరటాల శివ సినిమాకు ఇంకా చాలా సమయం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. తాజా చిత్రం తారక్ కి కొరటాలకు కూడా గేమ్ ఛేంజర్ కావాలన్నది ఆలోచన. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ పై సీరియస్ గా రీవర్క్ చేస్తున్నారని దీనివల్ల అక్టోబర్ వరకూ షూటింగ్ ని ప్రారంభించరని కూడా తెలుస్తోంది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా జక్కన్న హార్డ్ హిట్టింగ్ యాక్షన్ సన్నివేశాల కోసం తారక్ చాలా రిస్కులే చేశారు. కారణం ఏదైనా కానీ అతడికి భుజం నొప్పి ఇబ్బంది పెడుతోందని తెలిసింది. అదే క్రమంలో ఎన్టీఆర్ కు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాలుగు వారాల పాటు అతడు షూటింగుల్లో పాల్గొనకూడదని తెలిసింది.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజం నొప్పితో బాధపడుతూనే..ఇటీవల `బింబిసార` ఈవెంట్ కు హాజరయ్యారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మరోవైపు ఎన్టీఆర్ భుజం నొప్పితో రెస్ట్ తీసుకుంటుండగా.. ఇక ఎన్టీఆర్ 30 కోసం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారని ఈ చిత్రం అక్టోబర్ నాటికి ప్రారంభం కానుందని సమాచారం.దీంతో షూటింగ్ కూడా అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాాలున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నహీరోయిన్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.  ముందుగా ఆలియా భట్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె వివాహం, ఇతర సినిమాలతో బిజీగా మారడంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు (Anirudh Ravichander) అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here