ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ను సమర్థించిన అడ్వైజరీ కమిటీ

0
2

విద్వేష వ్యాఖ్యల కేసులో బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు షాక్ తగిలింది. విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ తనపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రాజా సింగ్ అడ్వైజరీ కమిటీలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ పిటిషన్ పై అడ్వైజరీ కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాజా సింగ్ పై పీడీ యాక్టును కమిటీ సమర్థంచింది. రాజా సింగ్ పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్టును కమిటీ సమర్థించింది. 

ఓ మతాన్ని కించపరిచేలా రాజా సింగ్ వీడియో విడుదల చేశారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజా సింగ్ ఇంకా జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉంటూనే తనపై నమోదైన పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ ఆయన అడ్వైజరీ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, అకారణంగా తనపై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారని ఆయన కమిటీకి విన్నవించారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన కమిటీని కోరారు. రాజా సింగ్ అభ్యర్థనను కమిటీ కొట్టివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here