ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశం..

0
7

గుడివాడలో కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ పై ఈడీ దాడులు చేయడం ఏపీలోనూ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. చికోటి ప్రవీణ్ గుడివాడలోనే కేసినోలు నిర్వహించలేదు. ఆయన బిజినెస్సే అది. ప్రత్యేక విమానాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున జూదరులను గోవా, శ్రీలంక, బ్యాంకాక్ వంటి చోట్లకు తీసుకెళ్తూంటారు. తాజాగా నేపాల్‌కు ఇలా తీసుకెళ్లిన అంశంలలో జూదంలో వందల కోట్లు చేతులు మారాయన్న సమాచారం మేరకు దాడులు చేసినట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ కేసినో నిర్వహణపై వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేస్తూండవచ్చు కానీ.. ఆయన పాత లెక్కలన్నీ సోదాల్లో వెలుగులోకి రావొచ్చని చెబుతున్నారు. గుడివాడ కేసినో వ్యవహారం కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. గుడివాడలో కేసినో అత్యంంత భారీగా జరిగింది. పెద్ద ఎత్తున జూదం జరిగిందన్న వాదన ఉంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతల గతంలో ఈడీకి ఫిర్యాదు చేసి ఉన్నారు. ఈ ఫిర్యాదును ఈడీ పరిగణనలోకి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here