ఏపీలో రైతుల తలసరి అప్పు రూ.2.40 లక్షలు…

0
10

ఒక్క మోటారుకు మీటరు పెట్టినా ఊరుకోం..నాటి సారా వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో అడ్డుకుంటాం

దేశంలో రైతుల తలసరి అప్పు రూ.75 వేలు అయితే ఏపీలో రైతుల తలసరి అప్పు రూ.2.40 లక్షలు…ఇదీ జగనన్న కానుక

మాట తప్పను..మడమ తిప్పననే మోసపు మాటలతో రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి నట్టేట ముంచేశారు..ఏపీ మరో శ్రీలంకలా మారుతుందనే నిపుణల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి

ఇంకా రుషులు, మునుల్లాగా మనం మౌనంగా కూర్చుంటామంటే సరికాదు….ప్రతి ఒక్కరూ తిరగబడి పోరాటం చేయాల్సిందే

మనుబోలు రైతుపోరులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్

ఎప్పటి నుంచో రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకే మీటర్ల పేరుతో కుట్ర

శ్రీకాకుళంలో ట్రయల్ రన్ పేరుతో మీటర్లు పెట్టారు…ఈ రోజు యూనిట్ రూ.6 వంతున బిల్లులేస్తున్నారు

మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కితగ్గినా జగన్ రెడ్డి మాత్రం ముందుకే పోతానంటున్నాడు

కేసీఆర్, స్టాలిన్, మమతాబెనర్జీ వంటి ఎందరో సీఎంలు రైతుల కోసం మీటర్లపై తిరగబడితే అదనపు అప్పులు, మీటర్ల కంపెనీలు కమీషన్ల కోసం జగన్ రెడ్డి కక్కుర్తిపడడటం అన్యాయం

మద్యపాన నిషేదమంటూ హామీలిచ్చి ఇప్పుడు పేదల రక్తం పీల్చుకుంటూ మద్యంపై ఏడాదికి 30 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టమొస్తే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడితో ఫోన్లో మాట్లాడే అనేక కీలకనిర్ణయాలు తీసుకుని ఊరటకల్పించాం…ఇంకా అవసరమనుకుంటే అర్ధరాత్రి వేళలో కూడా సీఎంతో సమావేశమైన సందర్భాలున్నాయి

చంద్రబాబు నాయుడు కూడా మంత్రులుగా మమ్మల్ని ఏనాడూ ఖాళీగా ఉంచలేదు…క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించమనేవాళ్లు

ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కష్టాలపై సీఎంని కలిసి వివరించే దమ్ము నాటి కన్నబాబుకు, నేటి కాకాణికి లేదు…తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కే దమ్ము ఏ మంత్రికి లేకుండాపోయింది

వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే రైతులకు ధాన్యం తాలూకూ రూ.400 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సివుంది..4 నెలలు గడిచిపోతున్నా ధాన్యం డబ్బులు ఇప్పించలేని కాకాణి ఒక మంత్రా

దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీ రైతులు మద్దతు ధర విషయంలో 11 శాతం నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఏసీపీ నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వానికి, మంత్రులకు సిగ్గనిపించడం లేదా

బిందు తుంపర్ల సేద్యానికి మా ప్రభుత్వ హయాంలో 10 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇచ్చాం..జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు..ఎంత మందికి ఇచ్చారు

ఈ ప్రభుత్వంలో రైతులకు స్ప్రేయర్లు, రొటావేటర్లు, కల్టివేటర్లు వంటి యంత్ర పరికరాలూ లేవు…భూసార పరీక్షలు లేవూ…సూక్ష్మ పోషకాల పంపిణీ లేదు

కీలకమైన బిందు తుంపర్ల సేద్యం విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ బట్టబయలు చేసింది

20 ఏళ్ల క్రితమే 2002లో ఇజ్రాయిల్ టెక్నాలజీ బిందు తుంపర్ల సేద్యాన్ని కుప్పం నియోజవర్గానికి తీసుకొచ్చి దేశానికి పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడైతే, ఈ మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తిగా మడతపెట్టేసిన పెద్దమనిషి జగన్ రెడ్డి

అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మొదటి స్థానం కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో కొనసాగుతుండటం బాధాకరం

కాకాణి మంత్రి అయ్యాక కోనసీమతో పాటు పెన్నార్ డెల్టాలోనూ క్రాఫ్ హాలిడేలు ప్రకటిస్తున్నారు

కళ్ల ముందే పుష్కలంగా నీళ్లున్నా ఈ పాలనలో మద్దతు ధర లభించడం గగనమని బంగారం పండే పొలాలను బీళ్లుగా పెట్టేస్తున్నారు

మనుబోలు మండల రైతుల దశాబ్దాల కల అయిన బండేపల్లి కాలువను సాకారం చేసేందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే వైసీపీ అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం బెదిరించి కాంట్రాక్టర్లను తరిమేశారు

సర్వేపల్లి ఎమ్మెల్యేగా రెండో సారి గెలిపిస్తే ఆర్నెళ్లలో బండేపల్లి కాలువ పనులు పూర్తి చేస్తామని మాటలు చెప్పి నాలుగేళ్లయినా ఈ రోజుకీ దిక్కులేదు

కనుపూరు కాలువపై చేయని పనులు చేసినట్టు చూపి రూ.10 కోట్లు ఎఫ్.డి.ఆర్ నిధులు కొట్టేసిన ఘనుడు కాకాణి

16 నెలలు జైలులో ఉన్న జగన్ రెడ్డి తన మంత్రివర్గంలోనూ దొంగతనం కేసులు, నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు వంటి కేసులున్న వారినే తీసుకుంటున్నారు…అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చి దోచుకుంటున్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతం కావాలి…మన రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవాలని కోరుతున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here