Teacher notification released In AP:
- ఉపాధ్యాయ పోస్టుల(Teacher Posts) కొరకు ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు.
- మొత్తం 282 టీచింగ్ సోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనున్నారు. ఈ పోస్టులను ఒక సంవత్సరం వరకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటిలో టీజీటీ ఉద్యోగాలు(TGT Posts) 71, పీజీటీ ఉద్యోగాలు(PGT Posts) 211 ఖాళీగా ఉన్నాయి. జోన్, కమ్యూనిటీల ఆధారంగా ఎంపికలు ఉండనున్నాయి.

జోన్ల వారీగా ఖాళీలు..
- మల్టీజోన్ లో 1లో టీజీటీ పోస్టులు 17, పీజీటీ పోస్టులు 33 ఉన్నాయి. జోన్ 2లో పీజీటీ పోస్టులు 04, జోన్ 3లో టీజీటీ పోస్టులు 23, పీజీటీ పోస్టులు50, జోన్ 4లో పీజీటీ 31, పీజీటీ 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి ఎలాంటి రాత పరీక్షలను లేవని.. కేవలం అభ్యర్థుల అర్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పనకు చివరి తేదీ ఆగస్టు 17గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రాథమిక జాబితాను సీనియారిటీ ప్రకారం ఆగస్టు 23న ప్రకటించనున్నారు. ఆగస్టు 24, 25న అభ్యంతరాలను స్వీకరించి.. ఇంటర్వ్యూ షెడ్యూల్ ను ఆగస్టు 29న వెల్లడించనున్నారు. ఆగస్టు 30న డెమో, స్కిల్ టెస్ట్ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక జాబితా సెప్టెంబర్ 5న, జాయినింగ్ తేదీ సెప్టెంబర్ 9న వెల్లడించనున్నారు.
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54ఏళ్ల వరకు ఉంటుంది. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో పాటు.. సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధించి సబ్జెక్టులో బీఈడీ తప్పనిసరి.