ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ: చంద్రబాబు

0
1

: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే ఇంకా వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదని వ్యాఖ్యానించారు.వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. ఆచంట నియోజకవర్గం ఇలపర్రు వద్ద స్థానికులు చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపడంతో అక్కడ ఆయన మాట్లాడారు.దేశంలో అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని.. అత్యధిక అప్పులు చేసింది కూడా ఏపీయే అని చంద్రబాబు విమర్శించారు. బాదుడే బాదుడుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పోలవరాన్ని రివర్స్‌ గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అంతకుముందు పెనుగొండ మండలం నశిపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ వరద బాధితుల సమస్యలు తెలుసుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here