యస్.సి.,యస్.టి విద్యుత్ వినియోగదారుల మిటర్లపై సబ్సిడీ కూడా ఎత్తివేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల అర్హులైన వారికి అన్యాయం జరుగుతుంది…
పల్నాడు జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలి…
వినుకొండ పట్టణంలో విద్యుత్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపేరుపై ఉన్న విద్యుత్ మిటర్లకు మరొకరి ఆధార్ నెంబర్ మరొకరి మొబైల్ నెంబర్ లు లింక్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అనేక మంది అమ్మ ఒడి లబ్దిదారులకు ఇబ్బందులు కలిగాయి. విద్యుత్తు శాఖ అధికారులు ఈ విధమైన చర్యలు చేయడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. యస్.టి యస్.టి లకు వచ్చే సబ్సిడీ విద్యుత్ ను కూడా ఎత్తి వేస్తున్నారు ఈ విషయం పై పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని యస్.సి ఎస్టీ విద్యుత్ వినియోగదారుల కు సత్వర న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా కలదు.
