ఒక్క రూపాయి వైద్యుడు కన్నుమూత..ప్రధాని మోదీ సంతాపం

0
6

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరొందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు సుషోవన్ బందోపాధ్యాయ్ 84 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పేదలకు రూపాయికే వైద్యం అందించారు. సుశోవన్ బందోపాధ్యాయ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరొందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు సుషోవన్ బందోపాధ్యాయ్ 84 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పేదలకు రూపాయికే వైద్యం అందించిన సుషోవన్ మరణవార్త విని అక్కడి ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.

కేవలం రూపాయికే వైద్యం చేయడం, పేదలకు సాయం చేస్తున్న సుషోవన్ బందోపాధ్యాయ్‌ని దేశం 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది. 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఆ తర్వాత తృణముల్ కాంగ్రెస్‌లో కొంత కాలం కొనసాగి రాజకీయాలకు వీడ్కోలు పలికారు. సుశోవన్ బందోపాధ్యాయ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

“డాక్టర్ సుషోవన్ బందోపాధ్యాయ మనందరికీ ఓ స్ఫూర్తి. ఓ గొప్ప హృదయం ఉన్న వారిగా.. ఎంతో మందికి వైద్య సేవలు అందించిన వ్యక్తిగా సుషోవన్ గుర్తిండిపోతారు. పద్మ అవార్డుల సమయంలో ఆయనతో కలిసిన క్షణాలు నేను గుర్తు చేసుకున్నాను. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here