సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి …
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తోటపల్లి గూడూరు ,ముత్తుకూరు మండలాల ముఖ్య నాయకులతో అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు..
సమావేశంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చిన ఫేస్ 1 ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభించాలని, ఓటు కు అనుసంధానం గురించి, రెండు మండలాలలో మిగిలి ఉన్న పంచాయతీలలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు..
ఓటర్ వెరిఫికేషన్ చేసి, ఓటు కు ఆధార్ అనుసంధానం యొక్క ఆవశ్యకతను ఓటర్ లకు తెలియపరచాలని, ప్రతి ఓటర్ ఆధార్ అనుసంధానం చేయించుకునేలా చూడాలని అన్నారు….
కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మిసురేంద్ర, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చీ భువనేశ్వరి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు, సన్నారెడ్డి సురేష్ రెడ్డి ,పల్లెం రెడ్డి ,రామ్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు…