కందుకూరు, విద్యుత్ బ్యాటరీ పేలి ఎలక్ట్రికల్ స్కూటర్ తగలబడిన ఘటన కందుకూరు పట్టణంలో చోటుచేసుకుంది. కందుకూరు పట్టణంలోని కనిగిరి రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రైవేటు బస్సులు ఆపుకొని చిన్నచిన్న రిపేర్లు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఒక రూము ఉంది ఆ రూము వద్ద చార్జింగ్ పెట్టిన వాహనం చార్జింగ్ తీసిన ఐదు పది నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా పేలిపోయిన ఘటన వెలుగు చూసింది పక్కనే ఉన్న పెద్దాయన నీళ్లు జల్లి మంటలను ఆర్పటం జరిగిందని తెలియజేశారు. అదృష్టవశాత్తు ఎవరుకు ఏమీ జరగలేదు.