కట్టెల కోసం వెళ్లి లక్షాధికారైన మహిళ..

0
4

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో కట్టెలు కొట్టుకునే మహిళకు అదృష్టం వరించింది. గెండా బాయి అనే ఎప్పటిలాగే కట్టెల కోసం అడవికి వెళ్లింది. కానీ ఆమెకు ఓ ముడి వజ్రం దొరికింది. దానిని వ్యాపారవేత్తలకు చూపించగా దాని విలువ లక్షల్లో ఉంటుందని చెప్పారు. వేలం నిర్వహిస్తే రూ.20 లక్షలకు వస్తుందని స్థానిక వ్యాపారులు తెలియజేశారు. దానిని వెంటనే డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేసింది. త్వరలో దానికి వేలం నిర్వహించి.. వచ్చిన డబ్బును ఆమెకు ఇస్తామని అధికారులు తెలిపారు.

ఓ మహిళకు అదృష్టం వరించింది. ఆ మహిళ కట్టెల కోసం వెళ్లి లక్షాధికారై తిరిగొచ్చింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇది నమ్మలేని నిజం. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పురుషోత్తంపూర్‌కు చెందిన గెండా బాయి (45) అనే మహిళ స్థానిక అడవిలో కట్టెలు సేకరించి.. వాటిని అమ్మి బతుకుంటుంది. రోజులాగే అడవిలోకి కట్టెల కోసం వెళ్లింది. కానీ ఈ సారి ఆమెకు అంత్యంత ఖరీదైన వజ్రం దొరికింది. అడవిలో 4.39 క్యారెట్ల ముడి వజ్రాన్ని గుర్తించింది. దానిని వ్యాపారవేత్తలకు చూపించగా దాని విలువ లక్షల్లో ఉంటుందని చెప్పారు. వేలం నిర్వహిస్తే రూ.20 లక్షలకు వస్తుందని స్థానిక వ్యాపారులు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here