‘కమిట్‌మెంట్’ సినిమాపై హిందూ సంఘాల ఫైర్..

0
6

సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

లక్ష్మీకాంత్ చెన్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’. ఈ సినిమా ఆగ‌స్ట్ 19న‌ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. రీసెంట్‌గా కమిట్‌మెంట్ అనే ఓ మూవీ టీమ్ నుంచి విడుదలైన చిన్న వీడియో బిట్ నెట్టంట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో భగవత్ గీత శ్లోకాన్ని కించపరిచే విధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడింది. దీంతో దీనిపై పెద్ద దుమారం రేగింది. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాపై కేసులు కూడా పెట్టారు. స‌దరు వీడియో బిట్‌పై క్ష‌మించాలంటూ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మీకాంత్ చెన్న ఓ వీడియో కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే కూడా క‌మిట్‌మెంట్ సినిమాపై హిందూ సంఘాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా విశ్వ హిందూ ప‌రిష‌త్ సంఘం క‌మిట్‌మెంట్ సినిమా యూనిట్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా క‌మిట్‌మెంట్ ట్రైల‌ర్ ప‌ర్మిష‌న్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ కూడా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేత‌లు కోరుతున్నారు. మ‌రి క‌మిట్‌మెంట్ సినిమా వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

తేజ‌స్వి మడివాడ , అమిత్ తివారి రమ్య పసుపులేటి, అన్వేషి జైన్‌ , అభయ్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, సిమర్ సింగ్, తనిష్క్ రాజన్ త‌దిత‌రులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఫుట్ లూస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌, ఎఫ్3 ప్రొడక్షన్స్ పతాకంపై బల్దేవ్ సింగ్, నీలిమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here