కరీంనగర్‌లో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం..

0
3

కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, టీటీడీ సహకారంతో: మంత్రి గంగుల

తిరుమల తిరుపతి దేవస్థానాల సహకారంతో కరీంనగర్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే ఈ భూ కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీకి అందజేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చేపడుతోన్న ఈ ఆలయ నిర్మాణ్నాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంత్రి గంగుల కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావే బాధ్యతలు చేపడతారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ అలా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి గంగుల తన కుటుంబసభ్యులతో కలిసి నేడు (ఆగస్టు 1) తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ ఆస్తిగా భావిస్తారని మంత్రి గంగుల అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల సహకారంతో కరీంనగర్ పట్టణంలో సీఎం కేసీఆర్.. 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే ఈ భూ కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీకి అందజేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చేపడుతోన్న ఈ ఆలయ నిర్మాణ్నాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని మంత్రి గంగుల తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతోనే తెలంగాణ సుభిక్షంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి గంగుల. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వీరచనం అందించగా.. టీటీడీ ఆలయ అధికారులు స్వామి వారి శేష పట్టు వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here