కరెంట్ షాక్ 10 మంది స్పాట్ డెడ్..

0
4
Electrical spark between two wires

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న పికప్ వ్యాన్‌‌ కరెంట్ షాక్‌కు గురవడంతో ఏకంగా పది మంది మృత్యువాత పడగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. పికప్ వ్యాన్ కూచ్‌బెహార్ నుంచి జల్పేష్ వెళ్తుండగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు

  • ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్‌కి కరెంట్ షాక్
  • 27 మందిలో పది మంది మృతి, 16 మందికి తీవ్రగాయాలు
  • పరారీలో పికప్ వ్యాన్ డ్రైవర్

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న పికప్ వ్యాన్‌‌ కరెంట్ షాక్‌కు గురవడంతో ఏకంగా పది మంది మృత్యువాత పడగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. పికప్ వ్యాన్ కూచ్‌బెహార్ నుంచి జల్పేష్ వెళ్తుండగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

పికప్ వ్యాన్ వెనుక భాగంలో అమర్చిన డీజే సిస్టం వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో వ్యానులో మొత్తం 27 మందికి ఉండగా.. పది మంది ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారని.. మరో 16 మంది జయపాయి గుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వివరించారు.

ప్రమాదంలో మరణించిన వారంతా సీతకూచి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నివాసితులుగా గుర్తించామని.. ఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని.. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here