కరోనాతో 24 మంది మృతి.. 

0
7

భారత్‌లో కొత్తగా 16,464 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 24 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,989కు చేరింది. కొవిడ్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు.

దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారినపడి 24 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,989కు చేరింది. కొవిడ్ కారణంగా భారత్‌లో మరణించిన వారి సంఖ్య 5,26,396కు ఎగబాకింది. దేశంలో ఇప్పటివరకు 4,40,36,275 మంది కరోనా బారినపడ్డారు. కొత్త కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం నాటి కేసుల కంటే మూడు వేల కేసులు తగ్గాయని వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 16,112 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం 8.34 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు.. దేశంలో మంకీపాక్స్ వైరస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదవడం అలజడి రేపుతోంది. కేరళలో మంకీపాక్స్ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here