మంగళగిరి నియోజకవర్గం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన…
ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
బాదుడే బాదుడు కరపత్రం పంచుతూ వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్.
ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తెచ్చిన ప్రజలు.
చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్న లోకేష్.
కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ జగరోనా వైరస్
జగరోనా వైరస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది.
అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారు.
పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలి.
మద్యపాన నిషేదం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాలు అంటూ రూ.10 కుడి చేత్తో ఇచ్చి బాదుడే బాదుడు పేరుతో ఎడమ చేత్తో రూ.100 కొట్టేస్తున్నారు జగన్ రెడ్డి.
ఫ్రీ దొరికే ఇసుకను బంగారం చేసి ఎంతో మందికి ఉపాధి లేకుండా చేశారు.
ఇసుక బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు. దోచుకున్న సొమ్మంతా నేరుగా తాడేపల్లి ప్యాలస్ కి వెళ్తుంది.
రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది.
ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదు.
అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని పెన్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.
ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు.