కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకున్న వ్యక్తి ..

0
10

తల్లి, భార్యాపిల్లల ముందే ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే సమయంలో అక్కడున్న జర్నలిస్టులు పెట్రోల్ బాటిల్ లాగేసి అగ్గి పెట్టెను లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే, నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మాక్లూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన శ్రీరాముల సత్యనారాయణ, కృష్ణ అనే వ్యక్తుల వద్ద 2 లక్షల 10 వేల ఇన్సూరెన్స్ ను ఫైనాన్స్ గా కన్వర్ట్ చేసుకున్నారు.

దీంతో ఇరువురు బాధితుడు శ్రీనివాస్ వద్ద 10 రూపాయల మేర వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై అనేక సార్లు పోలీసులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని వాపోయాడు. 

ఇటీవల కోర్టు నుంచి బాధితుడికి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. దిక్కుతోచని స్థితిలో భార్యా పిల్లలు, తల్లితో కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ప్రజావాణికి సెలవు కావటంతో తనకు న్యాయం జరిగే పరిస్థితి లేదని భావించి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కలెక్టర్ వస్తున్నది గమనించి కలెక్టర్ వాహనానికి అడ్డుగా వెళ్లి తన గోడు వెళ్ళ బోసుకున్నాడు. కలెక్టర్ నారాయణ రెడ్డి బాధితుడి సమస్యను తెలుసుకున్నారు. న్యాయం చేస్తానని కలెక్టర్ చెప్పటంతో బాధితుడు శ్రీనివాస్ వెనక్కి తగ్గాడు.

మంచిర్యాల జిల్లాలో అమానుషం

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన తల్లిదండ్రులు కుమారుడు బిక్షాటన చేసిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బాలుడు బిక్షాటన చేసి డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు. తండ్రి మద్యానికి డబ్బులు కావాలని అడగడంతో కుమారుడు ఇవ్వడానికి నిరాకరించాడు. కోపంతో తండ్రి కుమారున్ని  మూడు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. ఆదివారం కాగుతున్న వేడి నూనెను రెండు చేతులపై పోశాడు. బాలుడు గట్టిగా అరవడంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్సను అందించారు. ఇలాంటి పైశాచిక తండ్రిని పోలీసులు కఠినంగా శిక్షించాలని స్థానికులు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here