కల్తీ నూనెతో వంటలు

0
7

పుట్టగొడుగుల్లా వెలిసిన నూనె కర్మాగారాలు

నిబంధనలకు విరుద్ధంగా హోటల్లు

పలు హోటల్లో కుళ్ళిన మాంసంతో బిర్యానీ

ప్రజల ప్రాణాలతో చెలగాటం తనిఖీలు కరువు

కుర్చీలకే పరిమితమైన ఫుడ్& సేఫ్టీ అధికారులు

జిల్లాలో పుట్టగొడుగుల్లా హోటళ్లు అడుగడుగునా అన్నింటా కల్తీమయం..ప్రమాదంలో ప్రజల ప్రాణాలువెలిశాయి.అయితే అందులో స్వచ్ఛమైన పదార్థాలు మచ్చుకైనా కనిపించడంలేదు.చాలా వరకునిల్వచేసిన పదార్థాలు అమ్ముతున్నారని విమర్శలున్నాయి.రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న చిన్న హోటళ్ల నుండి రెస్టారెంట్ ల వరకు వంట పదార్థాలకు కల్తీ నూనె వాడుతున్నట్లు సమాచారం.ముఖ్యంగా మాంసాహారాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతున్నట్లు భోజన ప్రియులు తెలుపుతున్నారు.ఫ్రిజ్జులో మూడు నాలుగు రోజుల నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నారు.ఈ విషయం తెలియక భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తింటున్న ప్రజల ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి.

నూనె లోనూ కల్తీ మయం.?

కొన్ని హోటల్లలో కల్తీ నూనెలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.కల్తీ నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనారోగ్యం పాలైనూనె తయారీ కేంద్రాలు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.నాన్ వెజ్ హోటళ్ళలో ఇష్టానుసారంగా కల్తీ నూనెను వాడుతున్నారు.జిల్లాలోని ప్రముఖ ప్రముఖ పట్టణంలో నాణ్యత లేని నూనెలు తయారు చేసే కర్మాగారాలు,అమ్మే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.అయితే నూనె తయారీ కేంద్రాల్లో కూడా నాణ్యత పాటించండం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పెరిగిన పెద్ద పెద్ద హోటళ్ళు ,రెస్టారెంట్ లు,డాబాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు తక్కువ ధరకు లభించే కల్తీ నూనెను వినియోగిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ కల్తీకీ అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్& సేఫ్టీ అధికారులు కుర్చీలకే పరిమితమయ్యారే తప్ప తనీఖీలు నిర్వహించడం లేదని భోజన ప్రియులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఫుడ్&సేఫ్టీ అధికారులు స్పందించి పల్నాడు జిల్లాలో జరుగుతున్న కల్తీ నూనె,కల్తీ ఆహార పదార్థాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిధిలోని ప్రజలు కోరుతున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here