పేదలపై జగన్ రెడ్డిది కపట ప్రేమ అని రుజువైంది
తిరుమల తిరుపతి దేవస్థానం పేద కుటుంబాలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకూడదనే సదుద్దేశంతో తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల ఏడవ విడత కళ్యాణమస్తు కార్యక్రమానికి జగన్ రెడ్డి పంగనామాలు పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 26జిల్లా కేంద్రాల్లో ఆగష్టు 7న ఉదయం 8:07 నుండి 8:17 గంటల మధ్య టీటీడీ ముహూర్తం ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతి కోసం లేఖ పంపింది.
అయితే దీనిపై ముఖ్యమంత్రి, తన సలహాదారులు, సీఎం కార్యాలయం బాధ్యులు ఇంత వరకు స్పందించకపోవడంతో పెళ్లి కోసం సిద్దపడిన వధూవరులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ముఖ్యమంత్రికి పేదవాళ్ల సంక్షేమం, పేదవాళ్ల ఆనందం అంటే ఇంత నిర్లక్ష్యమని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.
టీటీడీని ముఖ్యమంత్రి తన పాకెట్ మనీబ్యాంక్ లా మర్చేసుకున్నారు.
దాని ద్వారా పేద ప్రజలకు అమలయ్యే పథకాలపై శ్రద్ధ ఏమాత్రం లేదు.
జగన్ రెడ్డి పేదలపై నీ కపటప్రేమ బట్టబయలైంది.
నీకు నిజంగా పేదలపై అంత ప్రేమాభిమానాలుంటే ఇలా ముహూర్తాలను తప్పించవు.
ఎంతసేపు నీకు నీ స్వప్రయోజనాలే తప్ప, సామాన్యుల కష్టాలు పట్టవా?
నీ ప్యాలెస్ కు వచ్చే నోట్ల కట్టల లెక్కలు చూసుకోవడం తప్ప, పేదవాళ్ల బాధలు, సంతోషాలు నీకు కనబడవా?
నెలరోజుల క్రితం పెళ్లి ముహూర్తం చూసుకుని, పెళ్లికోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది పేద ప్రజల ఆశలను ఆవిరి చేసిన నీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్పడం ఖాయం.
నీ కపట ప్రేమ, కల్లబొల్లి కబుర్లు ఇకపై చెల్లవు. టీటీడీ భక్తుల మనోభావాలు, భక్తిభావాలను నువ్వు దెబ్బతీశారు.
భక్తుల ఆశలకు భంగం కలిగించావు.
టీటీడీ అనేది సామాన్యులకు కాదు, కేవలం వీఐపీల కోసమే అనే విధంగా మార్చేశారు.
★ వైసీపీ మంత్రులు, తన అనుచరులు వందలాదిగా వీఐపీ దర్శనాలకు వెళ్లడానికి అనుమతులు ఇచ్చిన జగన్ రెడ్డికి, నేడు పేదవాళ్లు భక్తిభావంతో టీటీడీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతినివ్వకపోవడం దేనికి సంకేతమో స్పష్టమైంది.
★ తగిన సమయంలో పేదవాళ్లంతా జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాం.