కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి భార్య ఎమోషనల్ అయిన పోలీస్..!

0
11
  • సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ రక్షాబంధన్. ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచేది. అలాంటి పండుగ రోజు పోలీసులకు డ్యూటీ తప్పదు. చాలా మంది ఎంతో ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి.
  • Rakhi Festival: పోలీసు ఉద్యోగాలంటేనే తీరిక ఉండదు. ప్రపంచం అంతా పండుగలు చేసుకుంటే.. వారు మాత్రం డ్యూటీలో ఉండాల్సిందే. వారి బాధ్యత అలాంటిది. అలా ఎంతోమంది పోలీసులు పండుగలు, వేడుకల రోజున కూడా కుటుంబాలకు దూరంగా.. విధులకు దగ్గరగా ఉంటారు. శుక్రవారం నాడు రాఖీ పండుగ (Rakhi Festival). ఆ రోజు కూడా చాలామంది పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి (Kavya Reddy) సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్వయంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తోబుట్టువులకు దూరంగా ఉదయం నుంచి డ్యూటీలో నిమ్మగ్నమై పనిచేస్తున్న తన దగ్గరకు వచ్చి రాఖీ కట్టినందుకు.. కావ్య రెడ్డికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కృతజ్ఞతలు చెప్పారు. కావ్య రెడ్డి రాఖీ కడుతుండగా.. కానిస్టేబుల్ ఎమోషనల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here