కార్పొరేషన్ లో రికవరీ నిధుల గోల్మాల్..

0
3

ఎస్సీ కార్పొరేషన్ లో రికవరీ నిధుల గోల్మాల్ పై విచారణ మరియు
కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి. శివాజీ సోమవారం నాడు స్పందన గ్రీవెన్స్ నందు కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసి కోరారు.

ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో ఒక ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ డబ్బులు రికవరీ లో చేతివాటం చూపించి లక్షల్లో దోపిడీకి పాల్పడ్డాడని దీనిని గమనించిన ఆ శాఖ ఈ.డి అందించిన సమాచారం మేరకు సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారని,దీనిని జిర్ణించుకోలేని సదరు ఉద్యోగి ఏకంగా ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగిందని ఇది చాలా దుర్మార్గమైన చర్యఅని ఆయన అన్నారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద పనిచేసే సిబ్బంది వారి పర్మిషన్ తీసుకోకుండా సెలవు కూడా సమర్పించకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని,
2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన అన్నిరకాల సబ్సిడీ రుణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో దళిత సంఘాల ముసుగులో బినామీ పేర్ల మీద లక్షల సంఖ్యలో సబ్సిడీ రుణాలను దారి మళ్లించిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని,ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ లో సబ్సిడీ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు చెల్లిస్తున్న డబ్బులను తమ సొంత ఖాతాలకు మళ్లించి కార్పొరేషన్ కు చెల్లించిన నిధులను కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది దారి మళ్లించడం పై పూర్తిస్థాయిలో ఒక కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు.

గత 15 సంవత్సరాలుగా యస్సి కార్పొరేషన్ విధులు నిర్వహిస్తున్న అటెండర్, వాచ్మెన్, కార్ డ్రైవర్. స్టెనోగ్రఫీ ఉద్యోగాలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క విద్యార్హతలు కూడా తప్పుడు పత్రాలని వస్తున్న పిర్యాదులకై విద్యా అర్హతలపై సమగ్ర విచారణ చేపట్టాలని,షోకాస్ నోటీసు జారీ చేసిన
రికవరీ డబ్బులను తమ సొంత అకౌంట్ కి గూగుల్ పే ద్వారా ఇప్పటికీ జమ చేసుకుంటున్నా జగన్నాథం మురళీమోహన్ ను అరెస్ట్ చేసి పూర్తి విచారణ చేపట్టాలని,గడచిన కాలంలో ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై లబ్ధిదారుల ఫిర్యాదులపై ఎస్సీకార్పొరేషన్లో పని చేస్తున్న సిబ్బంది అందరిపై పూర్తిస్థాయిలో మరియు రుణాల విషయంలో లబ్ధిదారులు చెల్లించిన రసీదులు, బిల్లు బుక్కులు మాయమవ్వడం పై విచారణ చేపట్టాలని అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరిపై ప్రత్యేక కమిటీని వేసి సమగ్ర విచారణ చేపట్టి కార్పొరేషన్ అభివృద్ధికి,కార్పొరేషన్ ద్వారా దళితులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని,ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పై అక్రమంగా సదరు సిబ్బంది పెట్టిన కేసుపై తగు చర్యలు తీసుకోని యస్సి కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలను వెలికితీసి సంబంధిత సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోని కార్పొరేషన్ ను ప్రక్షాళన చేయాలని శివాజీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here