కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా..

0
4

రూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా…

ప్రజల్లో మనకు ఉన్న శక్తిని మరింత పెంచుకోవాలి…

తెలివితో కలిసికట్టుగా పనిచేసి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి…

  • షేక్అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి…

నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి లతో ముఖ్య నేతలతో ఆదివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ జూమ్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు…

బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు వంటి ప్రధాన అంశాల పై నేతలతో చర్చించారు.బాదుడే బాదుడు ను రాబోవు సార్వత్రిక ఎన్నికల వరకు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆదేశించారు…

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…

రాబోవు ఎన్నికల్లో టీడీపీ నీ గెలిపించుకొకపొతే, మన బిడ్డలని మనం మోసం చేసుకున్నట్టే అని, వారి భవిష్యత్తు ను అంధకారం లో నెట్టేసిన వారం అవుతామని పేర్కొన్నారు…

వైసిపి పాలనలో ఇప్పటికే వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ లు ఊర్లు వదిలి వెళ్లిపోయారని, మరో సారి వైసీపీ నీ గెలిపిస్తే సామాన్యులు సైతం ఊర్లు వదిలి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు…

ప్రజల్లో మనకున్న శక్తిని మరింత పెంచుకోవాలని, తెలివితో కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేసి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలని సూచించారు…

ప్రజల కోసం పోరాటానికి, మంచి పరిపాలన తిరిగి తెచ్చుకోవడానికి రూరల్ నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తానని అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here