ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ఆరు మండలాల కీలక నేతలతో మాజీ మంత్రి బాలినేని సమావేశమయ్యారు.. హైదరాబాదులో ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఇక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని ఆయన సూచించినట్లు పలువురు నేతలు తెలిపారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేందుకు బాలినేని ఆయన నివాసానికి ఆహ్వానించినట్లు సమాచారం.. ఆయన రాక తర్వాత గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురించి చర్చించి అతి త్వరలో నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు కీలక నేతల ద్వారా అందిన సమాచారం… ప్రస్తుతం హైదరాబాద్ కు బయలుదేరిన ఎమ్మెల్యే అన్నా ఆయన రాక కోసం నేతలు ఎదురుచూస్తున్నారు.