కీలక విషయాన్ని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..

0
7

ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం.. ఆ విషయంపై కుండబద్దలు కొట్టేసింది!

8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తోందా? 2026 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయనుందా? అనే ప్రశ్నకు పంకజ్ చౌదరీ లోక్‌సభలో సమాధానమిస్తూ.. 8వ కేంద్ర వేతన సంఘం ప్రతిపాదన లేదని తెలిపారు. అలాగే ఉద్యోగులపై ద్రవ్యోల్బణ ప్రభావం అంశంపై గురించి ఆయన వివరణ ఇచ్చారు. ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

డియర్‌నెస్ అలవెన్స్ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఆల్‌ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రాతిపదికన డీఏ పెంచుకుంటూ వెళ్తున్నామని వివరించారు. అంటే ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులపై పడకూడదని ప్రభుత్వం డీఏ చెల్లిస్తోందని చెప్పుకోవచ్చు.

కాగా 1947 నుంచి చూస్తే.. ఇప్పటి వరకు ఏడు వేతన సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతి పదేళ్ల తర్వాత ఒకసారి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కేంద్రం ఈ పే కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 28న ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు గురించి వేచి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని వెల్లడించాల్సి ఉంది. డీఏ పెంపు ప్రతి ఏటా రెండు సార్లు ఉంటుంది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల నుంచి డీఏను సవరిస్తూ వస్తుంది. త్వరలోనే కేంద్రం డీఏ పెంపును ప్రకటించొచ్చు. తొలి వేతన సంఘం 1946లో ఏర్పాటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here