కీళ్ల నొప్పులకు సింపుల్‌ చిట్కాలు..

0
6

అసమతుల్య జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. వర్షాకాలంలో కీళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద డాక్టర్‌ ఐశ్వర్య సంతోష్ కొన్ని సూచనలు చేశారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను ప్రయత్నించవచ్చని అంటున్నారు.

గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈరోజుల్లో చిన్న వయసు వారు ఈ సమస్యలు స్టార్ట్‌ అవుతున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అసమతుల్య జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉంటే, ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సీజన్‌లో తేమ వల్ల కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా.. వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి కీళ్ల నొప్పులు బాధిస్తాయి. కండరాలు గట్టిపడటం వల్ల.. ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి. మారుతున్న వాతావరణం.. కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం ఉంటుందని వైద్యులు అంటున్నారు. చల్లని వాతావరణం మీ కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ ఎక్కువగా ఉంటే రక్తం చిక్కగా అవుతుంది. ధమనులలో రక్తపోటు పెరుగుతుంది. రక్తాన్ని పంపిణీ చేయడానికి శరీరం కష్టపడాల్సి ఉంటుంది. కీల్ల చుట్టూ ద్రవం సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో కీళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద డాక్టర్‌ ఐశ్వర్య సంతోష్ కొన్ని సూచనలు చేశారు. కీళ్ల నొప్పులు తగ్గించే కొన్ని చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. వర్షాకాలంలో వాత దోషం పెరుగుతుందని, దీనివల్ల కీళ్ల నిప్పులు పెరుగుతాయని డా. ఐశ్వర్య వివరించారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను ప్రయత్నించవచ్చని అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here