తక్షణం సేవలు అందించేందుకు సంసిద్ధంగా వున్నాం: జిల్లా ఎస్పీ కృష్ణా నదికి ఎగువున కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరద ప్రవాహాన్ని జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, కృష్ణ నది పరివాహకంలో వున్నా కొల్లూరు, భట్టిప్రోలు, చోడాయపాలెం మరియు రేపల్లె పట్టన పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్షించి, భద్రత ఏర్పాట్లు చేసి అక్కడ పరిస్తితులును పరిశీలిస్తూ వరద ప్రభావిత ఏరియాలలో తీసుకోవలిసిన భద్రతాపరమైన ఏర్పాటులను, ముందస్తు భద్రతా పరమైన జాగ్రత్తలు, కరకట్ట ఏరియా, ప్రస్తుతం ముంపునుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాల నందు ప్రజలను అప్రమత్తం చేయడం గురించి, సంబంధిత శాఖల తో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,కృష్ణా నది ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీ గేట్లు తెరవడం వలన వరద నీరు అధిక మొత్తంలో కృష్ణ నది ద్వారా సముద్రంలోకి వెలుతున్నదువల్ల కృష్ట నది పరివాహక ప్రాంతాలలో వారికి ఏమైనా నష్టం వాటిల్లుతుందేమోనని, ముందస్తు భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు, బాపట్ల జిల్లా లోని కరకట్ట ప్రాంతాలు మరియు నది పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలు వున్న కొల్లూరు, భట్టిప్రోలు, చోడాయపాలెం మరియు రేపల్లె పట్టన పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని, గ్రామా మహిళ పోలీస్ లతోను, గ్రామాలకు కేటాయించిన పోలీస్ సిబ్బందితో నిత్యం సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉన్నామని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు సమస్య వస్తే వారకి సహాయం చెయ్యడానికి పోలీస్ యంత్రాంగం ముందు ఉంటుందని, ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటే పోలీస్ శాఖ ముందుగా మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.