కృష్ణ వంశీ కు 59 వ జన్మదిన శుభకాంక్షలు..

0
3

పసుపులేటి కృష్ణవంశీ (జ. జూలై 28, 1962) తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు, కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు . ఆ సినిమా పేరు నిన్నే పెళ్ళాడుతా. తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ‘ఆంధ్రా టాకీస్’ సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here