వంట గ్యాస్ సబ్సిడీలో భారీ కోత, ఏకంగా 99 శాతం – కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా, 2021-22 నాటికి ఏకంగా రూ.242 కోట్లకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సోమవారం రాజ్యసభలో ఈ సమాధానం ఇచ్చారు.
ఎల్పీజీ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. 2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా, 2021-22 నాటికి ఏకంగా రూ.242 కోట్లకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ 1న ఎల్పీజీ సిలిండర్ ధర రూ.706.50 ఉండగా, ఆదివారం నాటికి రూ.1,053కి (49 శాతం పెరిగినట్లు) చేరింది. సిలిండర్ ధరలకు ఆధారమైన ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఇదే సమయంలో టన్నుకు 508 డాలర్ల నుంచి 750 డాలర్లకు (47 శాతం) పెరిగింది.
మూడు వారాల క్రితమే వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధర తాజాగా రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,003 ఉండగా, తాజా పెంపుతో రూ.1,053 అయింది.
14.2 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధర ఇలా ఉంది..
హైదరాబాద్ - రూ.1105 ఢిల్లీ - రూ.1,053 ముంబై - రూ. 1,052.50 కోల్‌కతా - రూ. 1,079 చెన్నై - రూ. 1068.50 ఏపీలో సిలిండర్ ధరలు ఇలా విజయవాడ - రూ.1077 గుంటూరు - రూ.1092 విశాఖపట్నం - రూ.1061 అనంతపురం - రూ.1119.50 చిత్తూరు - రూ.1089 కడప - రూ.1103 తూర్పుగోదావరి - రూ.1081.50