కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాసనసభ సభ్యులు. సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేసారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
జననం :
తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రాజకీయ ప్రస్థానం :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు. 2018 డిసెంబరు 17న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాడు. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖలను కేటాయించారు