కేసీఆర్‌పై కేంద్ర మంత్రి విమర్శలు..

0
7

మూసీ నది పొర్లుతుంటే.. ఢిల్లీకెళ్లి ఏం చేశారు..

హైదరాబాద్ నగరంలో కురిసిన కుంభవృష్టితో మూసి నది పొంగుపొర్లుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఏం చేశారో ఎవరి అర్థం కావడం లేదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని శనివారం పరిశీలించిన కిషన్ రెడ్డి అక్కడ అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు

హైదరాబాద్ నగరంలో కురిసిన కుంభవృష్టితో మూసి నది పొంగుపొర్లుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఏం చేశారో ఎవరి అర్థం కావడం లేదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని శనివారం పరిశీలించిన కిషన్ రెడ్డి అక్కడ అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇన్నాళ్లపాటు ఏం చేసిందో అర్థం కావడం లేదంటూ విమర్శించారు.

గతేడాది లక్ష ఇళ్లల్లోకి నీళ్లు వస్తే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది.. మూసీ నదీ మీద కార్పొరేష్ ఏర్పాటు చేసుకుని రుణాలు తీసుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. మూసీ నదిని కొందరు ఆక్రమించుకున్నారని.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిపై పోరాడామని ఆయన గుర్తు చేశారు. మూసీని సబర్మతి నదిలా తయారు చేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వరదలు రాగానే ఢిల్లీ వెళ్లారంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని.. ఇప్పటికైనా విష ప్రచారాన్ని కట్టిపెట్టాలంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉందని.. ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలంటూ కిషన్ రెడ్డి చురకలు అంటించారు. ఎస్‌డీ‌ఆర్‌ఎఫ్ నిధులు ఖర్చు చేయాలని కోరుతున్నా వాటిని ఖర్చు చేయలేదని ఆడిట్‌లో తేలిందని ఆయన మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here