కేసీఆర్ ఉచ్చులో అస్సలు పడను..

0
4

అమిత్ షాను కలిశా – ఎమ్మెల్యే కోమటిరెడ్డి, పార్టీమార్పుపైనా వ్యాఖ్యలు

ఎన్నికల్లో గెలిచేందుకు నీచాతినీచమైన విధానాలను సీఎం కేసీఆర్ అనుసరిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే సీఎం కేసీఆర్ అన్ని రకాల హామీలు వస్తాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని తాను కోరుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామాగా కొట్టిపారేశారు. మునుగోడు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే, వారు చెప్తే తాను రాజీనామా చేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని అన్నారు. వారికి ఏది మేలు జరుగుతుందో ఆ పని కోసం తన సీటును కూడా త్యాగం చేస్తానని అన్నారు. కానీ, కేసీఆర్ ప్లాన్ ప్రకారం ట్రాప్‌లో పడదల్చుకోలేదని అన్నారు. 

మునుగోడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ తరహాలో ప్రలోభాలు పెట్టినట్లుగా ఇక్కడ కుదరదని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. తాను డబ్బు కోసం రంగులు, పదవుల కోసం పార్టీలు మారే రకం కాదని అన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే తాను ఓటేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేది బీజేపీ అని తాను మాట్లాడిన మాట నిజమేనని అన్నారు.

తాను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే, పార్టీని వదలకుండా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. ‘‘రాజగోపాల్ రెడ్డి మచ్చలేని వ్యక్తి. కొంత మంది డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీ మారారు. నేను పార్టీ మారాల్సి వస్తే నా మునుగోడు ప్రజలకు రెండు చేతులతో మొక్కి, వాళ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. అంతేకానీ, కేసీఆర్ డ్రామాలతో పేపర్లతో అబద్ధాలు రాయించడం వల్ల నేను లొంగను. నేను అమిత్ షాను కలిసిన మాట వాస్తవమే, బహిరంగంగానే కలిశా’’ 

కేసీఆర్‌ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యం
బీజేపీకి కేంద్రంలో అధికారం ఉంది. వాళ్లు గట్టిగా కొట్లాడితే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చు. మోదీ, అమిత్ షా అనుకుంటే కేసీఆర్‌ను బొంద పెట్టొచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది కాబట్టి, బీజేపీతోనే అది సాధ్యం అని నేను చాలా సార్లు చెప్పాను. నా స్వార్థం కోసం నేను అలా చెప్పలేదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నాజీవిత లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం, నా జీవితం ఇన్‌ కంప్లీట్ గా ఉండొద్దంటే టీఆర్ఎస్ ఓడాలి. లంగా పనులు చేసి జైలులోకి వెళ్లొచ్చిన వారు మాకు నీతులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here