కేసీఆర్ సర్కారుకు పోయే కాలం వచ్చింది: ఈటల

0
4

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో పల్లె గోస-బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న ఈటల.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఒత్తిడి వల్లనే 10 లక్షల పింఛన్లు పెంచారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో.. పల్లె గోస – బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఎవరినీ కలవరని.. అలాంటి సీఎం మనకు కావాలా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అరచేతిలో బెల్లం పెట్టీ.. మోచేతితో నాకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 ఏళ్లకు పింఛన్లు ఇస్తానని ఇవ్వలేదన్నారు. మూడేళ్లుగా 65 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టిన తరువాత.. ప్రజా క్షేత్రంలో తప్పించుకోలేకనే పంద్రాగస్టు నుంచి 10 లక్షల పింఛన్లు ఇస్తానని ప్రకటించారని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here