కొండెక్కుతోన్న చికెన్‌.. కిలో ఎంతంటే..?

0
6

 శ్రావణ మాసంలోను చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ఏకంగా రూ. 300లకు చేరుకోవడంతో నాన్‌వెజ్‌ ప్రియులు షాక్‌ తింటున్నారు. ఇలాంటి ధరలతో చికెన్‌ను కొనలేమంటూ బాధపడుతున్నారు.

శ్రావణ మాసంలోను చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ఏకంగా రూ. 300లకు చేరుకోవడంతో నాన్‌వెజ్‌ ప్రియులు షాక్‌ తింటున్నారు. ఇలాంటి ధరలతో చికెన్‌ను కొనలేమంటూ బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌ ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సామాన్యులకు చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండడంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.

మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతున్నా చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. బుధవారం స్కిన్‌లెస్‌ కిలో రూ.300కు చేరగా, లైవ్‌ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here