కొడవలితో వెంటపడ్డ DMK కౌన్సిలర్ భర్త..భయంతో పరుగులు తీసిన యువకులు…..

0
6

తమిళనాడు:

కొడవలితో ఓ డీఎంకే కౌన్సిలర్ భర్త కొందరు యువకుల వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

తమిళనాడులోని దక్షిణ తత్తమంగళం, మనచనెల్లుర్ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులతో గొడవ పడ్డ డీఎంకే కౌన్సిలర్ నిత్యా భర్త వెట్రి సెల్వన్ అనంతరం ఈ దాడికి దిగాడు. కొడవలితో అతడు విరుచుకు పడడంతో కొంత మంది యువకులు భయంతో పరుగులు తీశారు.

గుణశేఖర అనే వ్యక్తి నుంచి వెట్రి సెల్వన్ రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని, ఈ విషయంపైనే గొడవ చెలరేగిందని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) కింద ఓ లిక్కర్ యూనిట్ ను వెట్రి సెల్వన్ నడుపుతున్నాడు. కొందరు యువకులపై అతడు కొవవలితో దాడి చేయబోయిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కౌన్సిలర్ భర్త కొందరు పోలీసులపై దుర్భాషలాడాడు. అప్పట్లో ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు డీఎంకే కౌన్సిలర్ నిత్యా భర్త వెట్రి సెల్వన్ కు సంబంధించిన వీడియో బయటకు రావడం గమనార్హం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here