కొడుకును ముక్కలుగా నరికి పారేసిన తండ్రి!

0
1

ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ కథ-

అహ్మదాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసైన కుమారుడ్ని ఓ తండ్రి ముక్కలు ముక్కలుగా నరికేశాడు.

గుజరాత్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన ఓ కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

ఇదీ జరిగింది

అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. అంబావాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న 65 ఏళ్ల నీలేశ్ జోషి రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్. అతని కుమారుడు 21 ఏళ్ల స్వయం జోషి మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. డబ్బుల కోసం తండ్రితో తరచుగా గొడవపడేవాడు. ఈ నెల 18న మరోసారి డబ్బులు డిమాండ్ చేశాడు కొడుకు. నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆగ్రహంతో ఊగిపోయిన నీలేశ్.. కొడుకును వంట గదిలోని గ్రైండర్ రోలుతో తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో తల పగిలి కొడుకు మృతి చెందాడు.

నరికి

ఆ తర్వాత నీలేశ్.. ఎలక్ట్రానిక్‌ కట్టర్‌ మెషిన్‌, పాలిథిన్ బ్యాగులు కొనుక్కొచ్చి, కుమారుడి మృతదేహాన్ని ఆరు ముక్కలుగా కట్‌ చేశాడు. వాటిని పాలిథిన్‌ బ్యాగుల్లో ఉంచి స్కూటర్‌పై తీసుకెళ్లాడు. వివిధ ప్రాంతాల్లో వాటిని పాడేశాడు.

ఆ తర్వాత ఇంటికి తాళం వేసి నీలేశ్.. అహ్మదాబాద్‌ నుంచి బస్సులో సూరత్‌ చేరుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ వెళ్లేందుకు అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. 

పోలీసుల దర్యాప్తు

మరోవైపు ఈ నెల 20న అహ్మదాబాద్‌లోని వస్నా, ఎల్లిస్ వంతెన ప్రాంతాల్లో మానవ శరీర భాగాలను స్థానికులు గుర్తించడంతో కలకలం రేగింది. అహ్మదాబాద్‌ సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నీలేశ్ జోషిని నిందితుడిగా గుర్తించారు. అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నీలేశ్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు కనిపెట్టి, అరెస్ట్ చేశారు. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన కుమారుడ్ని తానే హత్య చేసినట్లు నీలేశ్ ఒప్పుకున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here