కొత్త మలుపు తిరిగిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసు..కీలక సూత్రధారిగా పాత్రికేయుడు?

0
18

Mulugu: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో మరో కోణం.. కీలక సూత్రధారిగా పాత్రికేయుడు?

  •  ములుగు జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది.
  • నర్సంపేటకు చెందిన ఎర్ర మట్టి వ్యాపారి దర్శకత్వంలో ఈ హత్య జరిగినట్టు భావిస్తుండగా, నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ విలేఖరి ఇందుకు పూర్తిగా సహకరించినట్లు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
  • న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ఇప్పటికే 40 మందికి పైగా మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, ఇతరులను పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది. అయితే ఈ హత్య కేసులో మొదటినుంచి పోలీసులు అనుమానించినట్లుగా కాకుండా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు.
  • ఇందులో ముఖ్యంగా నల్లబెల్లి మండలానికి చెందిన ఒక విలేకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ వర్గాలు ఈ విలేకరిని విచారించగా నర్సంపేట ప్రాంతానికి చెందిన ఎర్రమట్టి క్వారీ నిర్వాహకుడు ఈ హత్యకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. ఎర్రమట్టి వ్యాపారితో పాటు ఇద్దరు మాజీ ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. హత్య ఘటనలో నల్లబెల్లి మండలానికి చెందిన విలేఖరి కీలకపాత్ర పోషించినట్లు, హత్య చేసిన దుండగులను తన సొంత ఇంట్లో దాచి పెట్టినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • న్యాయవాది మల్లారెడ్డి హత్య ప్రణాళిక ఒక ప్రైవేట్ హోటల్లో చర్చించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం ప్రణాళికలో అమలు చేసే బాధ్యత నల్లబెల్లికి చెందిన విలేఖరి తీసుకున్నట్లు, ఇతని ద్వారానే నెల్లూరు ప్రాంతానికి చెందిన వారితో రూ. 50 లక్షలకు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రాధమిక సమాచారం. కానీ ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులు వివరణ ఇస్తే తప్ప ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here