కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం లో భాగంగా ఆదివారం సాయంత్రం ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణము కందుకూరు పామూరు రోడ్ లో శ్రీ రామ మందిరం వద్ద 6గంటల నుంచి 9గంటల వరకు శ్రీ రామ శరణ్ గురుదేవుల దివ్య ఆశీస్సులతో హనుమాన్ భక్త బృందం గురుస్వామి దుడ్డు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చేమిడిదపాడు శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం ప్రతీ ఆదివారం సాయంత్రం ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణము మూడవ ఆదివారము కందుకూరు లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి చాలీసా పారాయణము చేశారు. ట్రస్ట్ అద్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావు. ఏయిర్ టెల్ చిన్న, సురేష్, చక్కా కేశవరావు,సుబ్బారావు, నాగేశ్వరరావు, తిరుమలరావు, వేణు,రామలింగేశ్వరరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.