రోడ్డు పక్కన కారుకు పంక్చర్.. ఇంతలో పోలీసుల ఎంట్రీ.. పెద్ద హైడ్రామానే నడిచింది
ఏలూరు జిల్లాలో గంజాయి ముఠా గుట్టురట్టైంది. ద్వారకా తిరుమల మండలం కప్పలకుంట హైవేపై భారీగా గంజాయి పట్టుబడింది. ఈ గ్యాంగ్ ఇన్నోవా కార్లో గంజాయిని తరలించేందుకు ప్రయత్నించారు. కాగా కప్పలకుంట దగ్గర కారుకు పంచర్ అవడంతో రోడ్డు పక్కకు ఆపారు. అదే సమయంలో అక్కడకు వచ్చి పెట్రోలింగ్ పోలీసులను చూసిన నిందితులు కారును వదిలి పరారయ్యారు. అనుమానంతో వెళ్లి తనిఖీ చేయగా గంజాయి కనిపించింది. పోలీసులు సుమారు 350 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.