గంటలో పోగొట్టుకున్న బ్యాగును మహిళకు అందచేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

0
2
ongle bag case

ఒంగోలు N. T. R కాలనీ కి చెందిన వజ్రాల ధనలక్ష్మీ D/O ఆంజనేయులు అనే మహిళ ఈ రోజు సాయంత్రం సుమారు 06.05 గంటలకు ఒంగోలు లోని అంజయ్య రోడ్డు నందు రవి పిల్లల హాస్పిటల్ వద్ద ఆటో ఎక్కి ఒంగోలులోని కొత్త పట్నం బస్టాండ్ సెంటర్ లో దిగిన క్రమంలో తన బ్యాగును ఆటోలోనే మరచిపొయింది. సదరు విషయమును ఆమహిళ ఒంగోలు 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగిన విషయమును మరియు ఆటో లోని ప్రకాశం పోలీస్ వారు ఏర్పాటు చేసిన ఆటో ఓనర్ సమాచారంను తెలియచేయటంతో వెంటనే స్పందించిన ఒంగోలు టు టౌన్ సిఐ ఒంగోలు DSP U. నాగరాజు సూచనల మేరకు ట్రాఫిక్ పోలీస్ వారిని సమన్వయ పరుచుకొని, తమ సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బందిని అలెర్ట్ చేసి కేవలం గంటలోనే ఆటోను (AP27TX3280) గుర్తించి పరిశీలించగా ఆటోలో బ్యాగు ఉంది. ఆ బ్యాగును మరియు అందులో ఉన్న సుమారు 15 సవర్ల బంగారము (సుమారు 6 లక్షలు విలువ)మరియు విలువైన సర్టిఫికెట్స్ ను ఆ మహిళకు ఆటో డ్రైవర్ చేత బ్యాగును వారికి అప్పగించారు. అంతట సిఐ ఆటో డ్రైవర్ యొక్క నిజాయితీని అభినందించారు.

పోగొట్టుకున్న బ్యాగును, బంగారంను తిరిగి అతి తక్కువ సమయంలో పోలీస్ వారు తనకు అప్పగించినందుకు ఆ మహిళ మరియు వారి కుటుంబం సభ్యులు జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసినది.

ఇందులో మంచి పనితీరు కనపరచిన ఒంగోలు 2 వ పట్టణ CI N. రాఘవరావు ని, ట్రాఫిక్ RSI రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ మలిక గర్గ్ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here