గడప గడపకు మన ప్రభుత్వం..

0
2

నేను బడికెళ్తా….

సీటు కావాలి అని అడిగిన బాలిక.

తక్షణమే స్పందించి కేజీబీవీ లో సీటు ఇప్పించిన మంత్రి.

తనకు బడికి వెళ్లాలని ఉందని కానీ కేజీబీవీ లో సీటు రాకపోవటంతో తల్లిదండ్రులు తనను బడికి వద్దని అంటున్నారని 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక మంత్రి సురేష్ ఎదుట తన సమస్య విన్నవించుకుంది. యర్రగొండపాలెం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు ఈ సమస్యను విష్ణు ప్రియ అనే బాలిక చెప్పగానే చలించిన మంత్రి సురేష్ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఎక్కడ సీట్లు ఖాళీ ఉన్నవో వివరాలు అడిగారు. తక్షణమే దర్శి కేజీబీవీ లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పటంతో వెంటనే బాలిక దర్శికి వెళ్లేందుకు ఖర్చులకు కూడా స్వయంగా మంత్రి కొంత నగదు ఇచ్చి మరుసటి రోజు నుంచే పాఠశాలకు వెళ్ళవచ్చని హామీ ఇచ్చారు. దీనితో బాలిక ఆనందానికి హద్దు లేకపోగా తల్లిదండ్రులు మంత్రి కి కృతఙ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here