గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,047 కరోనా కేసులు..

0
9

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..?

 దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలోనే కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే.. సోమవారం భారీగా తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగాయి. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో మంగళవారం దేశవ్యాప్తంగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,28,261 (0.29 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.94 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,90,697 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,826 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 19,539 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,35,35,610 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.03 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 15,21,429 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here