గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, ఆలయ సిబ్బంది..

0
21

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ కాశీవిశ్వనాథ ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. మళ్లీ ఆ ఆలయంలో మరో గొడవ చోటుచేసుకుంది. ఈసారి భక్తులు, ఆలయ సిబ్బంది గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వామివారికి హారతీ ఇస్తున్న సమయంలో భక్తులు, ఆలయ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తలుపులు మూసివేస్తుండగా దర్శనం కావాలని భక్తులు పట్టుబడడంతో.. వాగ్వాదం జరిగింది. అది తీవ్రస్థాయికి వెళ్లి కొట్టుకున్నారు.

ప్రధానాంశాలు:

  • ప్రముఖ దేవాలయంలో కొట్లాట
  • దర్శన విషయంలో జరిగిన ఘర్షణ
  • పోలీసులు సహకరించడం లేదంటూ ఆలయ సిబ్బంది లేఖ
  • తమపై దాడి చేశారంటూ భక్తులు ఫిర్యాదు

ప్రముఖ దేవాలయంలో గొడవ జరిగింది. పవిత్రమైన గర్భగుడిలో భక్తులు, ఆలయ సేవకులు కొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో శనివారం ఇద్దరు భక్తులు, నలుగురు ఆలయ సేవకులకు మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

ఆలయ గర్భగుడిలో శనివారం సాయంత్రం హారతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో తలుపులు మూసివేస్తుండగా.. ఇద్దరు భక్తులు స్వామి వారి దర్శనం కావాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా భక్తులు దురుసుగా ప్రవర్తించారు. అదికాస్తా పెరిగి భక్తులు, ఆలయ సేవకులు ఒకరినొకరు గర్భగుడిలో నెట్టుకోవడం మొదలుపెట్టారు. ఓ పక్క హారతీ కార్యక్రమం జరుగుతుండగానే.. అక్కడ కొట్లాట జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఈ వీడియోలో ఆలయ సేవకులు, ఇద్దరు భక్తులు కాశీ విశ్వనాథ ఆలయం లోపలి భాగంలో ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. ఈ ఘటన తర్వాత ఆలయ సేవకులు… నిర్వాహకులకు లేఖ రాశారు. పోలీసులు తమకు సహకరించడం లేదని అందులో పేర్కొన్నారు. మరోవైపు నలుగురు ఆలయ సేవకులతో సహా ఐదుగురు దాడికి పాల్పడ్డారంటూ ఇద్దరు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా ఇటీవల కొద్దిరోజుల క్రితమే కాశీలో దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. దీంతో సిబ్బంది ధర్నాకు దిగి సమస్య పరిష్కరించినట్టు సమాచారం. అది మరువక ముందే తాజాగా ఇలా జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here