ఎనిమిదేళ్ల బాలుడికి లక్షణాలు! మంకీపాక్స్ కలకలంరేపుతోంది. ఓ బాలుడికి లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. టెస్టులకు శాంపిల్స్ పంపించారు. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
గుంటూరులో మంకీపాక్స్ అనుమానిత కేసు కలకలంరేపింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడి ఒంటిపై దద్దుర్లు కనిపించటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించారు. రెండు వారాల క్రితమే జీజీహెచ్‌కు బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు కాగా.. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు. రిపోర్ట్ రాగానే తేలుతుందంటున్నారు.. దాన్ని బట్టి తదుపరి కార్యచరణ ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.