గురువారం ప్రారంభం కానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్

0
6
command control center

గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం అవుతుందని.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దీంతో పాటు.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభం కాబోతోందని చెప్పారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సీసీసీని ప్రారంభిస్తారని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ బిల్డింగ్ ను ఐదు టవర్లుగా విభజించామని సీవీ ఆనంద్ వివరించారు. టవర్ ఏ లోని 18 ఫ్లోర్ లో సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుందని చెప్పారు. 14వ ఫ్లోర్ లో గ్యాలరీ, 5,6,7 ఫ్లోర్లలో కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందని వెల్లడించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిగా సీఎం కేసీఆర్ సృష్టేనని సీపీ సీవీ అనంద్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు ఇక్కడ నుంచే సమన్వయం చేసేలా.. టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ ఉంటుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారని సీవీ ఆనంద్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా పోలీసుల్ని ప్రోత్సహించారని వివరించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా మేరకే ఈ అద్భుత రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు. సీసీసీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని..ఇది పర్యావరణ హిత బిల్డింగ్ అని స్పష్టం చేశారు. కరెంట్ ఖర్చులు తగ్గేలా సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here