- పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు
- శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం విద్యార్థులు 2వేల అడుగుల అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గున్న ఆర్డీవో మురళీకృష్ణ
- జాతీయ జండా పట్టుకొని పురవీధుల్లో ర్యాలీ
- పింగళి వెంకయ్య దేశానికి ఎనలేని సేవలందించారు:ఆర్డీవో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గూడూరు పట్టణంలో శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం ఆధ్వర్యంలో విద్యార్థులు 2 వేల అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ పాల్గున్ని ర్యాలీనిప్రారంభించారు.ముందుగా పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండా ను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ‘‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నాను అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గాంధీ సిద్ధాంతాలను అనుసరించేవారు. మహాత్మా గాంధీ అభ్యర్థన మేరకు.. కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చక్రంతో భారత జాతీయ జెండాను రూపొందించాడు అనీ తెలిపారు.
శ్రీ చైతన్య పాఠశాల ఏ జి ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలందరూ ఓకే భావనతో ఉండాలి అనీ ఆనాడు మూడు రంగుల జాతీయ జెండాను రూపొందించారు అనీ తెలిపారు.కోట పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీచైతన్య పాఠశాల ప్రతి నెల నిరంతరం కొనసాగించే 9అద్భుతమయిన ” స్కార్స్ అవింగ్ ప్రోగ్రాం’ లో భాగంగా ఉద్వత్ భారత్ అనే కార్యక్రమాన్ని అజిబీ కా అమృత్ మహాత్సవ్ ‘తో జోడించి నిర్వహించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమం ఆగస్టు నెల మొత్తం శ్రీ చైతన్య విద్యార్థులుఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల జోన్లు శ్రీహరి, వారి బ్రహ్మ యాదవ్, రబ్బానీ భాషా, నాగరాజు, ప్రైమరి ఇన్చార్ట్ ఆఫ్సర్ తిప్రమం అనూర కిరణ్మయి, స్మార్ట్ వింగ్ ప్రోగ్రాం ఆఫ్ రైస్ కు వెంకటేశ్వర్ రావు, వసుంధర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.