గోదావరి వరదలు గురించీ చంద్రబాబు నాయుడు లేఖ..

0
10
 • రాష్ట్రంలో గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా 5 జిల్లాలలోని లక్షలాది మంది తీవ్రంగా ప్రభావితం అయ్యారు.
 • వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.
 • ఇటీవల నాలుగు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల బాధలు స్వయంగా పరిశీలించాను.
 • పి.గన్నవరం, రాజోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి దయనీయ పరిస్థితిలో ఉన్న ప్రజలను కలుసుకున్నాను.
 • ఆయా ప్రాంతాల్లోని లంక గ్రామాలతో పాటు, పోలవరం విలీన మండలాల్లో దారుణ పరిస్థితులు నన్ను తీవ్రంగా కలిచి వేశాయి.
 • వారి వెతలు చూసిన తరువాత అక్కడి పరిస్థితులు, ప్రభుత్వం చేయాల్సిన సాయంపై మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖను రాస్తున్నాను.
 1. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం మెరుగైన సాయం
 2. పోలవరం నిర్వాసితులకు న్యాయబద్దమైన, తక్షణ పరిహారం చెల్లించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉంది.
 • ఈ నెల రెండవ వారంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదల గురించి ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సిద్దం అవ్వలేదు.
 • బాధిత ప్రాంతాల ప్రజలకు సమాచారం ఇవ్వడం, వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కనీస వసతులతో పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది అనేది అక్కడి ప్రజలు చెపుతున్నమాట.
 • గతంలో హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో ప్రశంసనీయమైన కృషి చేసిన రాష్ట్ర యంత్రాంగం ఈ సారి బాధిత ప్రజల అవసరాలను గుర్తించలేకపోయింది.
 • పసిపిల్లలకు పాలు లేని పరిస్థితి, తాగడానికి నీరు, తినడానికి తిండి లేక తాము పడిన బాధలు ప్రజలు నా పర్యటనలో విన్నవించుకున్నారు.
 • వరద కష్టాలు ఒక ఎత్తు అయితే… వారికి జరిగిన ఆస్థి నష్టం మరింత తీవ్రంగా ఉంది.
 • ఇళ్లు కూలిపోయి, ఇంట్లో సామగ్రి వరద నీటికి కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టం జరిగింది.
 • గృహోపకరణాలు పనికిరాకుండా పోవడం వల్ల వేలాది మంది పెద్ద ఎత్తున నష్టపోయారు.
 • గ్రామాలకు గ్రామాలు వారం రోజుల పాటు వరదలో ఉండిపోవడం వల్ల నష్టం, కష్టం రెట్టింపయ్యింది.
 • రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ.2,000 సాయం న్యాయబద్దంగా లేదు.
 • జరిగిన నష్టంతో పోల్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయాలు వారికి ఏ రకంగానూ అక్కరకు రాదు.
 • కొన్ని చోట్ల ఇంట్లో ఒక్కరే ఉన్నారని రూ.1000 మాత్రమే ఇచ్చినట్లు స్వయంగా బాధితులు చెప్పారు.
 • పరిహారం పెంచి కుటుంబానికి కనీసం రూ.10,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది.
 • 2014లో హుద్‌హుద్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 12/10/2014న జి.ఓ. నెం.9ని జారీ చేసింది.
 • ఇందులో బాధిత కుటుంబాలకు సమగ్రమైన మరియు సహేతుకమైన సహాయ ప్యాకేజీని ఇచ్చాము.
 • అదేవిధంగా తిత్లీ తుఫాను సమయంలో 19.10.2018న జీవో ఎం.ఎస్‌ నెంబర్‌ 14 ద్వారా పరిహారం మరోసారి పెంచి ఇచ్చాము.
 • నాడు హుద్‌ హుద్‌, తిత్లీ తుఫాను సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 1. హుద్‌ హుద్‌ సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.15000 కు పెంచబడిరది. తరువాత వచ్చిన తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20000 ఇవ్వడం జరిగింది.
 2. ఉద్యాన పంటలకు హెక్టారుకు పరిహారం రూ.15,000 నుండి రూ.20,000… అరటికి రూ.30,000 మరియు ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1500 గా నిర్ణయించబడిరది.
 3. మరణించిన వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా రూ.1.50 లక్షల నుండి రూ.5.00 లక్షలకు పెంచబడిరది.
 4. ప్రతి కుటుంబానికి పాత్రల కోసం రూ. 2000 మరియు దుస్తులు పోగొట్టుకున్నందుకు మరో రూ. 2000 ఇవ్వబడిరది.
 5. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌, 2 కిలోల పప్పు,
  1 లీటర్‌ పామాయిల్‌, 0.5 కిలోల కారం పొడి, 0.5 కిలోల ఉప్పు, 1 కిలో పంచదార, 3 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు ఇవ్వడం జరిగింది.
 6. నేత కార్మికులకు, మత్స్య కారులకు ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇచ్చాము.
 7. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇంటికి రూ.50,000 ఆర్థిక సహాయం చెయ్యడంతో పాటు కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చేలా ఉత్తర్వులు.
 8. పూర్తిగా దెబ్బతిన్న ప్రతి కచ్చా ఇంటికి రూ.25,000 ఇవ్వడం జరిగింది..
 9. తీవ్రంగా దెబ్బతిన్న పక్కా మరియు కచ్చా గృహాల విషయంలో వరుసగా రూ.6,300 మరియు రూ.5,000 ఇవ్వడం జరిగింది.
 10. గుడిసెలు/ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లయితే ఒక్కొక్కరికి రూ.5,000 ఇవ్వడం జరిగింది.
 11. మృతి చెందిన ఆవు, గేదెలకు హుద్‌ హుద్‌ సమయంలో రూ.20,000 ఇవ్వగా…తిత్లీ సమయంలో దాన్ని పెంచి రూ.30,000 ఇచ్చాము.
 12. పౌల్ట్రీ పక్షుల నష్టానికి ప్రతి పక్షికి రూ.50 పరిహారం ఇచ్చాము.
 13. నేత కార్మికులకు రూ.10,000, వీధి వ్యాపారులకు రూ.5,000, దెబ్బతిన్న ఆటో మరమ్మతులకు రూ.5,000, దెబ్బతిన్న వలకు రూ.5,000, దెబ్బతిన్న మోటారు పడవకు రూ.20,000 ఇచ్చాము.
 • రాష్ట్ర విభజన సమస్యలతో నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్యాకేజీని పెంచి ఇవ్వడం జరిగింది.
 • ఈ ప్యాకేజీ 2014 సంవత్సరంలో అమలు చేయబడిరది. అప్పటి నుండి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు గడిచాయి.
 • ఈ 8 ఏళ్లలో పెరిగిన ధరలు, కోవిడ్‌ కష్టాలు, ప్రజలకు జరిగిన అపార నష్టంలోని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ పరిహారం మొత్తాన్ని ఇప్పుడు మరింత పెంచి ఇవ్వాల్సిన అవరం ఉంది.
 • ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా బాధిత కుటుంబాలకు కింద పేర్కొన్న విధంగా పరిహారం పెంచి ఇవ్వాలని కోరుతున్నాను.
  A.వరద ప్రభావిత ప్రాంతంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక మద్దతు.
  పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50,000 ఇవ్వాలి. రూ.2.50 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10,000. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇంటికి రూ. 25 వేలు అందించాలి.
 • వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు కనీసం రూ.25,000 మరియు ఆక్వాకల్చర్‌కు రూ.50,000 ఉండాలి.
  చనిపోయిన వ్యక్తికి రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలి.
  చనిపోయిన ఆవు లేదా గేదెకు రూ.40,000 ఇవ్వాలి.
  అరటి పంటకు, తమలపాకు తోటలకు హెక్టారుకు రూ.40,000 పరిహారం అందించాలి.
 • వరదల కారణంగా దెబ్బతిన్న మెరపనారుకు (హెక్టారుకు సరిపోయే) రూ.40,000 ఇవ్వాలి.
 • వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన వివిధ వృత్తుల వారికి, వివిధ వర్గాల వారికి రుణాలు ఇప్పించాలి. భీమా ఉన్న వాటికి వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలి. బాధితులు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు ఆసరాగా నిలవాలి.
 • ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుచుకుని వారు తమ ఇళ్లలోకి ప్రవేశించే వరకు పునరావాస, సహాయక శిబిరాలను మరికొన్ని వారాల పాటు కొనసాగించాలి. ఇళ్లకు వెళ్లిన వారికి తాగునీరు, మందులు పంపిణీ చేయాలి. మోకాళ్లలోతు బురద నిండిన తమ ఇళ్లు శుభ్రపరుచుకోవడం బాధితులకు అత్యంత భారంగా మారింది. ఇళ్లు
  శుభ్రపరుచుకునేందుకు ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేయాలి.
 • ఇళ్లలో కరెంట్‌ మీటర్లు వరదకు మునిగి దెబ్బతిన్నాయి. వాటిని ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటు చేయాలి. మూడు నెలల పాటు బాధిత ప్రాంత ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందించాలి. దెబ్బతిన్న విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు బాధితులకు 33 శాతం సబ్సిడీ ఇవ్వాలి.
 • వరద ప్రాంతాల్లో పశువుల పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. రెండు వారాలుగా పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోతున్నాయి. వెంటనే ఆయా ప్రాంతాలకు పశుగ్రాసం పంపిణీ చేయాలి.
 • పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎకరానికి
  రూ.5 లక్షల అదనపు పరిహారం మంజూరు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా
  ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కూడా 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిచేసిన ఈ ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సేకరించిన భూమికి ఎకరానికి 5 లక్షల రూపాయాలు పరిహారం ఇవ్వాలి. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా చూడాలి.2021 ఆగస్టు నాటికి నిర్వాసితులను కొత్తగా నిర్మించే పునరావాస కాలనీలకు మారుస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అది ఇప్పటికీ నెరవేరలేదు.
 • పోలవరం పునరావాస కాలనీల నిర్మాణం పూర్తయి ఉంటే బాధితులు ఈ స్థాయి కష్టాల పాలయ్యేవారు కాదు.ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా టిడిపి ప్రభుత్వ సమయంలో మొదలు పెట్టిన పునరావాస కాలనీలను కూడా పూర్తి చెయ్యలేదు.
 • ఆయా కాలనీలలో వసతుల కల్పన కూడా చేపట్టలేదు. ఆ కాలనీలను వెంటనే పూర్తి చేసి నిర్వాసితులకు అప్పగించాలి.
 • పోలవరం నిర్వాసితులకు దశల వారీ పరిహారం అనే విధానాన్ని పక్కన పెట్టి అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
 • పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలిపితే మునిగే ప్రాంతాలకే పరిహారం ఇస్తాము అని ప్రభుత్వం చెప్పడం సరికాదు.
 • 45.72 మీటర్ల ఎత్తుకు నీరు నిలిపితే మునిగే ప్రాంతాలకు కూడా పరిహారం వెంటనే ఇవ్వాలి. లేకపోతే వరద వచ్చిన ప్రతి సారీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోలవరం కోసం తమ భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై
  ఉంది.
 • పోలవరం నిర్మాణంతో రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూర్చడం ఎంత ముఖ్యమో, దానికి భూములు ఇచ్చి సహకరించిన నిర్వాసితులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యం అని ప్రభుత్వం గుర్తించాలి.
 • పోలవరం విలీన, ముంపు మండలాల్లో గిరిజనుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఊళ్లలోకి, ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేక దయనీయ పరిస్థితిలో అడవిలో, పునరావాస కేంద్రాల్లో, రోడ్ల పక్కన అరకొర వసతుల మధ్య రోజులు గడుపుతున్న వరద బాధితులను ప్రభుత్వం సహృదయంతో ఆదుకోవాలని కోరుతున్నాను.

నోట్‌:- లేఖతో పాటు హుద్‌ హుద్‌ సమయంలో పరిహారంపై ఇచ్చిన జీవో నెం.9,
తిత్లీ పరిహారంపై ఇచ్చిన జీవో నెం.14కు జతచేయడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here