గోరంట్ల వీడియోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

0
6

గోరంట్ల వీడియోపై మరోసారి స్పందించిన మంత్రి రోజా.. టీడీపీ కుట్రే అంటూ సంచలన వ్యాఖ్యలు..

హిందూపురం ఎంపీ గోరంట్ల వీడియో పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.  అశ్లీల వీడియో వ్యవహారంలో.. టిడిపి కుట్ర అంటూ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తెలుగు దేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని అన్నారు. వైసీపీ పార్టీ మీద బురద జల్లడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంత దిగజారిపోయారో మరోసారి ఈ ఉదంతం ద్వారా వెల్లడవుతుందని చెప్పారు. ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఐటీడీపీ అంటే.. లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగమని సరికొత్త అర్ధం చెప్పారు మంత్రి రోజా. అందులో భాగంగా ఓ మార్ఫింగ్ వీడియో అప్ లోడ్ చేసి.. ఏ విధంగా తమ ప్రభుత్వం మీద దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తుందో తెలుస్తోంది.. తమ ప్రభుత్వం మీద విజయం సాధించాలంటే.. మార్ఫింగ్ వీడియోతో కాకుండా.. మేనిఫెస్టో తో రావాలని సూచించారు. టీడీపీ అంటే.. తెలుగు దుష్పచారాల పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. ఈరోజు నిజంగా జగనన్న లాంటి మంచి మనసున్న సీఎం గా ఉండడం తమ అదృష్టమని రాష్ట్రంలోని మహిళలు అందరూ అనుకుంటున్నారని చెప్పారు. తమ సొంత అన్నలా, తమ్ముడిలా ఆదరిస్తున్నారని .. సీఎం కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని.. టీడీపీ వారు ఇటువంటి దిగజారుడు పనులకు దిగారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి రోజా..

అంతేకాదు.. టీడీపీ మహిళా నేత అనితకు రోజా కొన్ని ప్రశ్నలను సంధించారు. మా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలనీ మీరు కోరుకుంటున్నారు.. కదా ఎందుకు సస్పెండ్ చేయాలనీ ప్రశ్నించారు.. మహిళల రక్షణ కోసం దిశా యాప్ ని తీసుకొచ్చినందుకా.. విద్య దీవెన, చేనేత, అమ్మఒడి , వైస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయుత పథకాలను ప్రజలు అందిస్తునందుకు సస్పెండ్ చేయాలా.. మీరు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయం లో జరిగిన అన్యాయాల పై మేము పోరాడుతున్న సమయంలో మీరు ఎందుకు స్పందించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు రోజా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here